న్యూయార్క్, సెప్టెంబర్ 11: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ముఖానికి మాస్కుల వాడకం తప్పనిసరైంది. అయితే, సింగిల్ యూజ్ మాస్కుల వల్ల టన్నుల కొద్దీ వ్యర్థాలు పేరుకుపోతుండటం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలొరాడో పరిశోధకులు చేసిన తాజా ప్రకటన ఒకటి ఊరట కలిగిస్తున్నది. కాటన్తయారుచేసిన మాస్కులు ఉతికి ఆరేస్తున్నా ఏడాది వరకూ సమర్థంగా వైరస్ను అడ్డుకోగలవని అధ్యయనానికి నేతృత్వం వహించిన మరీనా వాన్స్ తెలిపారు. అయితే, ఈ మాస్కుతో శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురవ్వవచ్చని పేర్కొన్నారు. వస్త్రంతో తయారైన మాస్కును వాడటంతో పోలిస్తే, సర్జికల్ మాస్కుపై కాటన్ మాస్కును ధరిస్తే మరింత మంచిదని, దీంతో మాస్కుకు 40 శాతం వడబోత సామర్థ్యం పెరుగుతుందన్నారు. కేఎన్95, ఎన్95 మాస్కులతో 83-99 శాతం వరకు దూళి, వైరస్ను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు.