కీవ్: ఉక్రెయిన్, రష్యా మధ్య ఏడాదిగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా(Russia) ఆక్రమిత ప్రాంతంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కాల్చివేశారు. దీంట్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తూర్పు ఉక్రెయిన్‌కు చెందిన వోల్నవాకా పట్టణంలో ఈ ఘటన జరిగింది. అక్టోబర్ 27వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. ఇళ్లు ఇవ్వలేదన్న కోపంతో రష్యా సైనికులు ఆ కుటుంబాన్ని కాల్చివేసి ఉంటారని ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఇద్దరు రష్యా సాయుధుల్ని షూట్ చేశారు. ఈ ఘటన పట్ల రెండు దేశాలు వేర్వురుగా దర్యాప్తు ప్రారంభించాయి. రక్తపు మరకలు, బుల్లెట్లు దిగిన శరీరాలు.. మంచాలపై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వోల్నవాకా ఘటనలో రష్యా హస్తం ఉన్నట్లు ఉక్రెయిన్ అంబుడ్స్‌మన్ దిమిత్రో లుబినైట్స్ తెలిపారు.