ఖాట్మాండు: నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల పర్వతారోహకుడు అరుదైన ఫీట్ అందుకున్నాడు. 8వేల మీటర్ల ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న 14 పర్వతాలను అధిరోహించిన అత్యంత పిన్న వయసున్న వ్యక్తిగా నిమా రింజి షెర్పా(Nima Rinji Sherpa) రికార్డు నెలకొల్పాడు. తాజాగా చైనాలోని మౌంట్ షిషపంగమా పర్వతాన్ని అతను ఎక్కాడు. సముద్ర మట్టం కన్నా షిషపంగమా పర్వతం సుమారు 8027 మీటర్ల ఎత్తు ఉన్నది. నిమాతో పాటు పసంగ్ నుర్బు షెర్పా కూడా ఆ పర్వతాన్ని ఎక్కారు. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున ఆరు గంటలకు శిఖరంపైకి చేరుకున్నారు.
Nima Rinji becomes world’s youngest to scale all 14 peaks. More: https://t.co/W3W5XkpAD5 pic.twitter.com/C8B7Z9MXPh
— Everest Today (@EverestToday) October 9, 2024
16 ఏళ్ల 162 రోజుల వయసులో పర్వతారోహణ స్టార్ట్ చేశాడు నిమా. 2022 సెప్టెంబర్‌లో మౌంట్ మనసులు పర్వతాన్ని అతను తొలుత ఎక్కాడు. ఆ పర్వతం ఎత్తు 8163 మీటర్లు. పర్వతాలను ఫోటో తీయాలన్న మక్కువతో నిమా పర్వతారోహరణ మొదలుపెట్టాడు. 7వేల మీటర్ల ఎత్తు వరకు ఎటువంటి ఆక్సిజన్ సపోర్టు లేకుండానే పర్వతాలను ఎక్కేందుకు నిమా ఇష్టపడుతారు. 2023లో అతను కొన్ని గంటల తేడాలోనే అతను రెండు పర్వతాలను ఎక్కేశాడు. మౌంట్ ఎవరెస్ట్(8848.86మీ), మౌంట్ లోట్సే(8516మీ)లను అతను 17 ఏళ్ల వయసులోనే అధిరోహించాడు.
Dawa Yangzum becomes first Nepali woman to complete all 14 peaks. More: https://t.co/JVfLxxvRLh pic.twitter.com/1P3KDL1raW
— Everest Today (@EverestToday) October 9, 2024
నేపాల్‌కు చెందిన 33 ఏళ్ల దవా యాంగ్జుమ్ అనే మహిళ కూడా 14 పర్వతాలను అధిరోహించింది. 14 శిఖరాలను ఎక్కిన తొలి నేపాలీ మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేసింది.