Tiger : పులి సంచార ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు : కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో..
రాజాపేట, ఫిబ్రవరి 03 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల గ్రామాలలో పులి సంచరిస్తున్నందున పులిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలపై అటవీ అధికారులతో కలెక్టర్ చర్చించారు. అటవీ అధికారులు పులిని పట్టుకోవడానికి ధర్మల్ డ్రోన్‌ను ఉపయోగించి పులి సంచరిస్తున్న ప్రదేశాలను వీడియో తీయడం, ట్రాప్ కెమెరా, పులిని బంధించడానికి బోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అటవీ శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ప్రత్యేకంగా అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని తెలిపారు.
రాత్రి వేళలో పశువులను బయటికి వదలకుండా పశువుల పాకలో వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయరాదన్నారు. జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ సిబ్బంది పులి అడుగు జాడలను గమనిస్తూ, దాన్ని పట్టుకోవడానికి, అడవిలోకి పంపడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట డీఎఫ్ఓలు సుధాకర్ రెడ్డి, పద్మజ, రాజాపేట బీట్ అధికారి నిఖిత ఉన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

