న్యూఢిల్లీ: పంజాబ్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఆరోపణలపై జశ్విందర్ ముల్తానీపై ఎన్ఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల లూథియానా కోర్టులో జరిగిన పేలుడు ఘటనలో జిశ్విందర్ ముల్తానీ నిందితుడిగా ఉన్నారు. అయితే అతన్ని జర్మనీలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) పేరుతో జర్మనీలో ముల్తానీ ఓ సంస్థను నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్కు వ్యతిరేకంగా పంజాబ్లో అతను యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది.