Asteroid | వాషింగ్టన్, జనవరి 31: 2024 వైఆర్4 అనే భారీ గ్రహ శకలం(ఆస్టరాయిడ్) 2032లో భూమిని ఢీ కొట్టవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 130-300 అడుగుల పొడవు గల ఈ గ్రహ శకలం మానవాళికి మొత్తానికి తక్కువ ప్రమాదకారి అయినా ఒక పెద్ద నగరాన్ని తీవ్రంగా నాశనం చేయగల శక్తిని కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
దీని ప్రభావం 8 మెగా టన్నుల టీఎన్టీకి సమానమని… ఇది హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు కన్నా 500 రెట్లు శక్తివంతమైనది అయి ఉండొచ్చని వారు వెల్లడించారు. అయితే డిసెంబర్ 22, 2032లో ఈ గ్రహ శకలం భూమి ఢీ కొట్టే చాన్స్ ఒక్క శాతమేనని.. అంటే 99 శాతం దాని ప్రభావం భూమిపై ఉండదని వారు తెలిపారు.