New Zealand: మావోరి తెగ భాషలో ఇరగదీసిన 21 ఏళ్ల మహిళా ఎంపీ.. వీడియో వైరల్
New Zealand: మావోరి భాష ఎలా ఉంటుందో ఈ ఎంపీ ప్రత్యక్షంగా పార్లమెంట్‌లోనే చూపించారు. తొలి సారి ఎన్నికైన ఓ మహిళా ఎంపీ తన తెగ భాషను హాహాకారాలతో వినిపించారు. న్యూజిలాండ్‌లో మావోరి తెగకు చెందిన మైపి క్లార్క్ ఇటీవల ఎన్నికయ్యారు. పార్లమెంట్లో ప్రసంగిస్తూ మావోరి భాషలో ఆమె మాట్లాడారు. ఆ వీడియోను మీరూ చూడండి.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్( New Zealand)లో మావోరి తెగకు చెందిన 21 ఏళ్ల మహిళా ఎంపీ హనా రాహితి మైపి క్లార్క్ తొలిసారి ఇటీవల పార్లమెంట్‌కు ఎన్నికైంది. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయసులో ఎంపికైన నేతగా ఆమె రికార్డు క్రియేట్ ఛేశారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. హౌరకి వైకాటో స్థానం నుంచి ఆమె గెలుపొందారు. న్యూజిలాండ్ స్థానిక తెగ మావోరిల గురించి మైపి క్లార్క్ చాన్నాళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు.
అయితే పార్లమెంట్లో తొలి ప్రసంగం చేసిన మైపి క్లార్క్ మావోరి భాషలో మాట్లాడారు. భావోద్వేగానికి లోనైన ఆమె చాలా అవేశపూరితంగా మావోరి స్వరాన్ని వినిపించారు. మీకోసం చస్తా.. కానీ మీ కోసం కూడా జీవిస్తాను అని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. మావోరిలో తమ భాషలో మాట్లాడుతుంటే ఎలాంటి సంకేతాలు ఇస్తారో.. అలా ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ అందర్నీ ఆకర్షించారు.
ఆక్లాండ్, హామిల్టన్ మధ్య ఉన్న చిన్న పట్టణం హంట్లే ఆమె సొంత ఊరు. అక్కడ ఆమె మావోరి కమ్యూనిటీ గార్డెన్ నడిపిస్తోంది. మొక్కల పెంపకంపై చిన్నారులను ఎడ్యుకేట్ చేస్తోందామె. చంద్రమానం క్యాలెండర్ ప్రకారం మావోరిలు గార్డెనింగ్ చేస్తుంటారు. మావోరి తెగ ప్రజల స్వరాన్ని పట్టించుకోవాలని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.
New Zealand natives’ speech in parliament pic.twitter.com/OkmYNm58Ke
— Enez Özen | Enezator (@Enezator) January 4, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

