సిడ్నీ, జనవరి 24: ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత, కట్టడికి విధించిన ఆంక్షల నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన వివాహాన్ని రద్దు చేసుకొన్నారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం స్వయంగా వెల్లడించారు. తన సుదీర్ఘ భాగస్వామి, ఫిష్షింగ్ షో హోస్ట్ క్లార్కే గేఫోర్డ్ను పెండ్లి చేసుకోవాలని ఆర్డెర్న్ నిర్ణయించుకున్నారు. వివాహ తేదీ నిర్ణయం కానప్పటికీ, కొద్ది వారాల్లో పెండ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో పెండ్లిని వాయిదా వేసుకొన్నారు.