America | వాషింగ్టన్: అమెరికన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై పోస్టులు పెట్టే అమెరికన్లను సెన్సార్ చేసే విదేశీయులకు వీసాలను జారీ చేయకుండా ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. అమెరికన్లను వారి దేశంలోనే విదేశీయులు బెదిరించడం ఆమోదయోగ్యం కాదని విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ వారంట్లు, ఇతర దండన చర్యలు చేపడతామని అమెరికన్లను బెదిరించడం సరికాదన్నారు.
అమెరికన్ టెక్ ప్లాట్‌ఫామ్‌లపై అమెరికన్లు పెట్టిన పోస్టుల్లోని కంటెంట్‌ను తొలగించాలని లేదా సరిదిద్దాలని డిమాండ్ చేసే విదేశీయులపై ఈ వీసా నిషేధం నిబంధనను అమలు చేస్తామన్నారు. గ్లోబల్ కంటెంట్ మాడరేషన్ పాలసీలను అనుసరించాలని అమెరికన్ టెక్ కంపెనీలను విదేశీయులు డిమాండ్ చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు.