న్యూయార్క్: అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు టైప్1 డయాబెటిస్ రోగులకు శుభవార్త చెప్పారు. ఇన్సులిన్ అవసరం లేకుండానే చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచే పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని అమర్చుకుంటే అందులో కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా ఇన్సులిన్ లేకపోయినా చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.