ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్
బోలా, కరోనా, మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగు చూసింది. ఆఫ్రికాలోని ఘనాలో మార్బర్గ్ వైరస్‌ను కనుగొన్నారు. రెండు వారాల క్రితం ఈ వైరస్ సోకిన ఇద్దరు బాధితులు తాజాగా మరణించారు
న్యూఢిల్లీ, జూలై 8: ఎబోలా, కరోనా, మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగు చూసింది. ఆఫ్రికాలోని ఘనాలో మార్బర్గ్ వైరస్‌ను కనుగొన్నారు. రెండు వారాల క్రితం ఈ వైరస్ సోకిన ఇద్దరు బాధితులు తాజాగా మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ధ్రువీకరించింది. ఎబోలా కుటుంబానికి చెందినదే మార్బర్గ్ వైరస్.
గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు/మనుషుల స్రావాలను నేరుగా తాకడం వల్ల సంక్రమిస్తుంది. వైరస్ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. జ్వరం, రక్త విరేచనాలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం, కండ్లు ఎర్రబడటం, మూత్రంలో రక్తం, తలనొప్పి, ఆయాసం వంటివి లక్షణాలుగా ఉంటాయి. మరణాల రేటు 88 శాతం వరకూ ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

