న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ XEC (XEC Covid Variant) ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్నది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇచ్చారు. యూరోప్‌లో ఈ వైరస్ ప్రబలుతున్నట్లు తెలుస్తోంది. చాలా వేగంగా ఇది డామినెంట్ స్ట్రెయిన్‌గా మారింది. ఈ కొత్త వేరియంట్‌ను తొలుత జర్మనీలో తొలిసారి కనుగొన్నారు. ఆ తర్వాత XEC వేరియంట్ కేసులు బ్రిటన్, అమెరికా, డెన్మార్క్‌తో పాటు ఇతర దేశాల్లో నమోదు అయ్యాయి. ఓమిక్రాన్ వేరియంట్‌కు సబ్‌లీనియేజ్‌గా ఉన్న ఈ కొత్త వేరియంట్లో కొత్త తరహా మ్యుటేషన్లు జరుగుతున్నాయి.
గతంలో ప్రబలిని ఓమిక్రాన్ సబ్వేరియంట్లు కేఎస్.1.1, కేపీ.3.3 తరహాలో XEC వ్యాపిస్తున్నది. ప్రస్తుతం యూరోప్‌లో XEC వేరియంట్ వేగంగా విస్తురిస్తున్నది. 27 దేశాల నుంచి 500 శ్యాంపిళ్లను పరీక్షిస్తున్నారు. పోలాండ్, నార్వే, లగ్జంబర్గ్, ఉక్రెయిన్, పోర్చుగల్, చైనా దేశాల్లో XEC కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్లలో XEC వేరియంట్‌కు వేగం ఎక్కువగా ఉన్నట్లు లండన్ జెనటిక్స్ కాలేజీ ప్రొఫెసర్ ఫ్రాంకోసిస్ బల్లాక్స్ తెలిపారు.
XEC వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, బరువు తగ్గడం, వొళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయి. ఓమిక్రాన్ వేరియంట్‌కు చెందడం వల్ల .. వ్యాక్సిన్లు, బూస్టర్లతో రక్షణ కల్పించవచ్చు. స్వేచ్ఛమైన వాయువును పీల్చాలని అమెరికా సీడీసీ తెలిపింది. XEC వేరియంట్ సోకిన వారిని నిశితంగా పరిశీలించాలని పరిశోధకులు చెబుతున్నారు.