ఒట్టావా : కెనడాలో వేలాదిమంది భారత సంతతి కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న నూతన పౌరసత్వ చట్టానికి ఆమోదముద్ర పడింది. కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బిల్లు ‘సీ-3’కి అధికారిక ఆమోదం లభించింది.
చట్టం అమలుకు సంబంధించి అధికారిక అమలు తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ‘సెకండ్ జనరేషన్ కటాఫ్’ అనే నియమాన్ని ప్రస్తుత చట్టంతో రద్దుచేశారు. తద్వారా కెనడా పౌరులైన తల్లిదండ్రుల ద్వారా పౌరసత్వం పొందేందుకు అర్హత ఉన్న వేలాది భారత సంతతి కుటుంబాలకు ఇది మేలు చేస్తుంది.