బ్యాంకాక్: అయిదేండ్ల క్రితం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకొన్న సంగతి మరచిపోకముందే మరో కొత్త కరోనా వైరస్ పుట్టుకొచ్చింది.
జర్నల్ సెల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. థాయ్లాండ్ శాస్త్రవేత్తలు గబ్బిల్లాల్లో కొత్త కరోనా వైరస్ను గుర్తించారు. ఇది మనుషులకు వ్యాపించే సామర్థ్యం కలిగి ఉన్నదని వారు తెలిపారు. ప్రస్తుతానికి ఇది మనుషులకు వ్యాపించినట్టు గుర్తించనప్పటికీ.. వ్యాప్తి చెందితే పరిస్థితి ప్రమాదకరంగా ఉండొచ్చని భావిస్తున్నారు.