Microsoft | న్యూయార్క్, జూలై 19: మైక్రోసాఫ్ట్ విండోస్‌లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలు రంగాల్లో ఏర్పడిన అంతరాయంపై నెటిజన్లు కొందరు సరదాగా స్పందించి జోక్‌లు, మీమ్‌లు, ఎమోజీలతో కామెంట్లు చేశారు. ‘కొంతమందికి శుక్రవారమే వారాంతం ప్రారంభమైంది. హ్యాపీ వీకెండ్, థాంక్యూ మైక్రోసాఫ్ట్, ధాంక్యూ బ్లూ స్క్రీన్’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘మైక్రోసాఫ్ట్ డౌన్‌కు కారకుడైన ఆ వ్యక్తికి కార్పొరేట్ ఉద్యోగులంతా కృతజ్ఞతలు చెబుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో అప్రాధాన్యమున్న బ్లూ స్క్రీన్‌ను హైలెట్ చేస్తూ మరికొందరు మీమ్స్ ఉంచారు. ఒంటి నిండా నీలం రంగు పూసుకుని ఉన్న ఒక వ్యక్తి మీమ్‌ను ఎక్స్‌లో ఒక యూజర్ ఉంచి ‘ప్రస్తుతం ప్రతి కంపెనీలో ఐటీ విభాగాలు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. సిస్టమ్‌పై బ్లూ స్క్రీన్ చూసి కార్పొరేట్ ఉద్యోగులు బాధ నటిస్తూ లోపల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్న భావనతో ఉండే మీమ్లను కొందరు షేర్ చేశారు.

మైక్రోసాఫ్ట్‌పై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా వ్యంగ్యంగా స్పందించారు. మైక్రోసాఫ్ట్… మేక్రోహార్డ్గా మారిందంటూ 2021లో తాను చేసిన పోస్టును ఆయన రీ పోస్ట్ చేస్తూ ‘టీమ్‌లు చాలా బాగున్నప్పటికీ’ అంటూ వ్యాఖ్యానించారు. రెండు నవ్వుతున్న ఎమోజీలతో డాగ్ డిజైనర్ షేర్ చేసిన మీమ్‌పై కూడా మస్క్ తన ఎక్స్‌లో స్పందించారు. ‘తక్కినవన్నీ మూతపడినా ఈ యాప్ మాత్రం ఇప్పటికీ పని చేస్తున్నది’ అంటూ క్యాప్షన్ ఉంచారు. ప్లే గ్రౌండ్లో కొందరు క్రికెట్ ఆడుతుండగా, ఒక వ్యక్తి పడుకుని తాపీగా వారిని చూస్తున్న దృశ్యం మస్క్ షేర్ చేసిన మీమ్‌లో ఉంది.
మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక కారణాల వల్ల ఫ్లైట్ బుకింగ్, చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ ఇష్యూయింగ్లో మాత్రమే కాకుండా ఫ్లైట్ ట్రాకింగ్, ఫ్లైట్ స్టేటస్ చెకింగ్‌లోనూ సమస్యలు తలెత్తినట్టు అమెరికన్ విమానయాన సంస్థ ఫ్రంటీయర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. విండోస్ ఓఎస్‌లో తలెత్తిన సమస్యతో తమ విమానాలు గాల్లో ఎక్కడ ఉన్నాయన్న సమాచారమూ తమకు తెలియలేదని అధికారి ఒకరు వాపోయారు.
డెవలపర్ – మైక్రోసాఫ్ట్
తొలి వెర్షన్ – విండోస్ 1, 1985
తాజా విడుదల 23హెచ్2, 2024
అందుబాటులోని భాషలు – 110
లైసెన్స్డ్ యూజర్లు -110 కోట్లు
అన్లైసెన్స్డ్ యూజర్లు- 540 కోట్లు
మొత్తం యూజర్లు – 650 కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా వాడే
కంపెనీలు – 90 శాతం
విండోస్ వాడే దేశాలు – 190