జెరూసలేం: గాజాను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. ‘గాజాను ఒక పాలక మండలి స్వాధీనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.
గాజాను స్వాధీనం చేసుకునే ప్రణాళిక మాకు లేదు’ అని ఆయన ప్రకటించారు. అమెరికాతో టారిఫ్ వివాదం నేపథ్యంలో ఆయన భారత్కు మద్దతు ప్రకటించారు. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.