మాకు భారత్ ఉంది.. వాన్స్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన నెతన్యాహు
ఇజ్రాయెల్‌కు ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికా మాత్రమేనంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు.
జెరూసలేం : ఇజ్రాయెల్‌కు ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికా మాత్రమేనంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు. ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వాన్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఆయన ప్రతి మాటనూ ఏకీభవించనంటూ ‘మాకు భారత్ వంటి మరికొన్ని మిత్రదేశాలు ఉన్నాయని, 140 కోట్ల జనాభా కలిగిన ఆ చిన్న దేశం(వ్యంగ్య ధోరణిలో) నుంచి మాకు అపారమైన మద్దతు లభిస్తున్నది’ అని అన్నారు.
స్వదేశీ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతు తెలుపుతున్నారని నెతన్యాహు పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో జరిపిన దౌత్యపరమైన చర్చలను ఇజ్రాయెల్ నేతలు వ్యతిరేకించడాన్ని జేడీ వాన్స్ తప్పుబడుతూ, ఒకవేళ తానే గనుక ఇజ్రాయెల్ క్యాబినెట్లో ఉంటే, ప్రపంచంలో తనకు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశంపై దాడి చేసేవాడిని కాదంటూ వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

