ఇస్తాంబుల్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూపై టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్(Erdogan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాతో పాటు ఇరాన్‌పై యుద్ధం సాగిస్తున్న నెతన్యహూను.. ఆడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు. ఊచకోతలో హిట్లర్‌ను నెతన్యహూ దాటేసినట్లు ఆరోపించారు. ఇజ్రాయిలీ దాడులపై స్పందించేందుకు తమ హక్కు ఉందన్నారు. పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన భయానకమైన ఫోటోలు, వీడియోల తరహాలో.. గాజాలో ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఊచకోతకు పాల్పడుతున్న నెతన్యహూ ఎప్పుడో నియంత హిట్లర్‌ను దాటేసినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు తమ ప్రయత్నం తాము చేస్తున్నట్లు ఎర్డగోన్ వెల్లడించారు. ఇరాన్‌పై మాత్రమే కాదు.. గాజా, సిరియా, లెబనాన్, యెమెన్ దేశాలపై అమానవీయ దాడి జరుగుతోందని, ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నామన్నారు.