కాఠ్మాండు: నేపాలీ షెర్పా, ప్రఖ్యాత పర్వతారోహకుడు కామి రిటా(Kami Rita) చరిత్ర సృష్టించాడు. ఎవరెస్టు శిఖరాన్ని అతను 31వ సారి ఎక్కాడు. అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించిన రికార్డును నెలకొల్పాడు. గతంలో తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో కామిరిటా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్టును ఎక్కాడు.
గత రెండేళ్ల నుంచి ట్రెక్కర్ కామి రిటా ప్రతి సీజన్లో రెండు సార్లు మౌంట్ ఎవరెస్టును అధిరోహించాడు. ఈసారి భారతీయ సైన్యానికి చెందిన దళాన్ని కామి రిటా తీసుకెళ్లాడు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్, 14 పీక్స్ ఎక్స్‌పెడిషన్‌లో సీనియర్ గైడ్‌గా కామి రిటా చేస్తున్నాడు. నేపాల్‌లోని సోలుకుంబ్ సమీపంలోని థామే గ్రామంలో జిన్మించాడు. పర్వతారోహణకు అతను జీవితాన్ని అంకితం చేశాడు. 1970, జనవరి 2వ తేదీన అతను పుట్టాడు. చిన్నతనం నుంచి పర్వతాలు ఎక్కాలన్న తపనతో పెరిగాడు. గత రెండు దశాబ్ధాల నుంచి కామి రిటా పర్వతాలను అధిరోహిస్తున్నాడు.
తొలిసారి 1992లో కామి రిటా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. ఓ బృందానికి అతను సపోర్ట్ సభ్యుడిగా వెళ్లాడు. అప్పటి నుంచి ధైర్యంగా ఎవరెస్టును ఎక్కే ప్రయత్నం చేశాడు. 1994 నుంచి 2025 వరకు కామి రిటా మౌంట్ ఎవరెస్టును 31 సార్లు ఎక్కినట్లు చాంగ్ దావా తెలిపారు. కే2తో పాటు లోసే పర్వతాలను ఒక్కసారి ఎక్కాడు. మనస్లు మూడు సార్లు, చో యూ 8 సార్లు అధిరోహించినట్లు తెలుస్తోంది.
JUST IN: Renowned Nepali mountaineer Kami Rita Sherpa has successfully scaled Mt #Everest (8848.86 m) for a record 31st time this morning 27.05.2025, 04:00 NPT. CONGRATULATIONS!
Photo Courtesy: Seven Summit Treks. pic.twitter.com/SpmfrDQT2q
— Everest Today (@EverestToday) May 27, 2025