ఖాట్మాండు : నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికైన పుష్ప కమల్ దహల్ ప్రచండ బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ నెల 10న పార్లమెంట్లో బల పరీక్ష జరుగనున్నది. విశ్వాస తీర్మానానికి సంబంధించి పార్లమెంట్‌కు లేఖ సైతం పంపినట్లు సెక్రటేరియట్ అధికార ప్రతినిధి రోజ్నాథ్ పాండే తెలిపారు. అత్యధిక మెజారిటీతో ప్రధానమంత్రిగా ఎన్నికవగా.. 30 రోజుల్లో దిగువ సభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ మంత్రివర్గం మంత్రివర్గం సిఫారసుపై హౌస్ సెషన్‌కు పిలుపునిచ్చారు.
నవంబర్ 20న జరిగిన ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రతినిధుల సభ, జాతీయ అసెంబ్లీ సమావేశం కానున్నాయి. డిసెంబర్లో నేపాల్ ప్రధానిగా ప్రచండ మూడోసారి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. మరో వైపు ప్రచండ కేబినెట్లోకి ముగ్గురు డెప్యూటీ ప్రధానులను తీసుకున్నారు. విష్ణు పాడెల్కు ఆర్థిక మంత్రిత్వ శాఖ, శ్రేష్ఠ రవాణా మంత్రిత్వ శాఖ, లామిచానేకు హోం మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఓలీ పార్టీ నుంచి జ్వాలా కుమారి, దామోదర్ భండారీ, రాజేంద్ర కుమార్ రాయ్‌లకు మంత్రి పదవులు దక్కాయి. అదే సమయంలో జన్మత్ పార్టీకి చెందిన అబ్దుల్ ఖాన్‌కు మంత్రి పదవి కూడా లభించింది.