Nepal elections | నేపాల్లో కొనసాగుతున్న సాధారణ ఎన్నికలు.. దేవుబా-ఓలీ పార్టీల మధ్య రసవత్తర పోరు
Nepal elections | నేపాల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారు. 2015 లో కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇవి రెండో ఎన్నికలు. కాగా, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేందుకు భారత్ కూడా సహకరిస్తున్నది.
Nepal elections | నేపాల్ పార్లమెంట్, అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు ఏకకాలంలో ఓటింగ్ జరుపుతున్నారు. ఫలితాలు వారం రోజుల్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు చెందిన నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య పోటీ నెలకొన్నది. 2015 లో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలు ఇవి.
నేపాల్ పార్లమెంట్లోని మొత్తం 275 స్థానాలు, ప్రావిన్షియల్ అసెంబ్లీలలో 550 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2015 లో ప్రకటించిన కొత్త రాజ్యాంగం తర్వాత ఇది రెండో ఎన్నికలు. దేశంలోని 1.80 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేపాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భారత్ కూడా సహకరిస్తున్నది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఓటింగ్ జరిగేలా భారత్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. నేపాల్తో భారత్, చైనా సరిహద్దులను మూసివేశారు.
నేపాల్లో రాజకీయ అస్థిరత సర్వసాధారణంగా మారింది. 1990 లో ఇక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది. దాంతో 2008 లో రాచరికం రద్దయింది. 2006 లో అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. తరచూ నాయకత్వ మార్పులు, రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పోరు కారణంగా అభివృద్ధి మందగిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేపాల్లో 1990 నుంచి ఇప్పటి వరకు 30 ప్రభుత్వాలు మారాయి. 2008 లో రాచరికం ముగిసిన తర్వాత కూడా 10 ప్రభుత్వాలు మారడం విశేషం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

