లోతుకుంట భూములపై స్టేటస్కో తొలగింపు
మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామ సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూములపై హకులు నిర్ధారణ అయినందున వాటిపై స్టేటస్కో కొనసాగించాలంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను తొలగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.
- హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తప్పించాలన్న సింగిల్
- జడ్జి ఉత్తర్వులపై స్టే కొనసాగించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామ సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూములపై హకులు నిర్ధారణ అయినందున వాటిపై స్టేటస్కో కొనసాగించాలంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను తొలగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. కోర్టు ధికరణ కేసులో హైడ్రా కమిషనర్ ఉద్యోగం నుంచి ఏవీ రంగనాథ్‌ను రిలీవ్ చేయాలని, ఆయన స్థానంలో అర్హులైన మరో వ్యక్తిని నియమించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టడంతో వివాదాస్పద ఆస్తి గుర్తింపుపై అభ్యంతరాలున్నాయని రంగనాథ్ తరఫు న్యాయవాది తెలిపారు. శాంతా శ్రీరాం కన్స్ట్రక్స్ కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..
సర్వే నంబర్లు 1, 2కు సంబంధించి పిటిషనర్‌కు అనుకూలంగా సివిల్ కోర్టుతోపాటు సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయని, ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. సదరు భూమికి సంబంధించిన పూర్వాపరాల్లోకి తాము వెళ్లడంలేదని, కోర్టు ధికరణ కేసులో హైడ్రా కమిషనర్ ఉద్యోగం నుంచి రంగనాథ్‌ను తప్పించాలన్న అంశాలకే పరిమితమవుతున్నామని స్పష్టంచేసింది. రంగనాథ్‌ను త ప్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై గతం లో ఇదే కోర్టు విధించిన స్టేను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భూమి గుర్తింపునకు సంబంధించి సర్వేపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని పేరొంది. గతంలో జారీచేసిన స్టేటస్కో ఉత్తర్వులను ఎత్తివేస్తున్నామని ప్రకటిస్తూ.. అప్పీళ్లపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 20కి వాయిదా వేసింది.
ఉత్తర్వుల జారీకి ఏఐ వినియోగమా: హైకోర్టు
రెవెన్యూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తుల పరిషారానికి కృత్రిమ మేధసు (ఏఐ)ని వినియోగించి ఉత్తర్వులు జారీచేస్తున్న జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ భూమికి సంబంధించి కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమాడూరుకు చెందిన ఎం కొమురయ్య పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ మంగళవారం ఈ ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

