కాఠ్మాండూ : ఎవరెస్ట్ పర్వతంతో పాటు 8,000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తయిన పర్వతాలపైకి ఒంటరిగా వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన పర్వతారోహణ నిబంధనల ప్రకారం, ప్రతి ఇద్దరు పర్వతారోహకులకు తప్పనిసరిగా ఒక మౌంటెయిన్ గైడ్ ఉండాలి. ఇతర పర్వతాలను అధిరోహించడానికి ఒక బృందానికి కనీసం ఒక మౌంటెయిన్ గైడ్ తప్పనిసరి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,849 మీటర్లు.