మాస్కో: కొవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాలో జనాభా తగ్గిన నేపథ్యంలో.. తిరిగి జనాభా పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడి మహిళలకు నజరానా ప్రకటించారు.
‘మదర్ హీరోయిన్’ పేరిట సోవియట్ కాలంలో ఉన్న పురస్కారాన్ని పునరుద్ధరించనున్నారు.10 కన్నా ఎక్కువ మంది పిల్లలను కనే వారికి రూ.13 లక్షల రివార్డును ఇవ్వనున్నట్టు తెలిపారు. 10వ బిడ్డ పుట్టిన ఏడాదికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే అప్పటికీ మిగిలిన 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు విధించారు.