శాన్ఫ్రాన్సిస్కో: చరిత్రలోనే తొలిసారిగా ఓ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి రానున్నది. ‘ఆస్టరాయిడ్ 2023’ దక్షిణ అమెరికా మీదుగా భూఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ట్రక్కు బాక్స్ పరిమాణంలో ఉండే ఇది ఈ వారంలోనే భూమి సమీపానికి వస్తున్నట్టు నాసా పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ ఆస్టరాయిడ్తో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. ఒకవేళ ఢీకొట్టినా 3.5 మీటర్లనుంచి 8.5 మీటర్ల పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం భూవాతావరణంలో ఏదో ఒకచోట విచ్ఛిన్నం అవుతుందని తెలిపారు.