నలుగురు రాజకీయ ఖైదీల్ని ఉరితీసిన మయన్మార్ ఆర్మీ
యంగూన్: మయన్మార్ సైన్యం ఇవాళ ఆ దేశానికి చెందిన నలుగురు రాజకీయ కార్యకర్తల్ని ఉరి తీసింది. కొన్ని దశాబ్ధాల తర్వాత ఆ దేశం తొలిసారి మరణ దండన విధించింది. మాజీ ఎంపీ ఫోయో జియా థావ్, రచయిత కో జిమ్మీ, హలా మియా ఆంగ్, ఆంగ్ తురా జాలకు మరణశిక్ష అమలు చేసినట్లు మయన్మార్ జుంటా ఆర్మీ ప్రకటించింది. జూన్‌లోనే నలుగురికి మరణశిక్ష విధిస్తూ మయన్మార్ ఆర్మీ ప్రకటన చేసింది. దానిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అయితే గత ఏడాది మయన్మార్ సైన్యం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆంగ్ సాన్ సూకీకి చెందిన ఎన్ఎల్డీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగిన ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ సమయంలో ఆర్మీ రంగ ప్రవేశం చేసి ప్రభుత్వాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నది. యంగూన్‌లోని ఇన్సెయిన్ చెరసాలలో ఆ నలుగుర్నీ ఉరి తీశారు. ఉరికి ఒక రోజు ముందు ఆ నలుగురు తమ తమ ఫ్యామిలీతో జూమ్ కాల్లో మాట్లాడారు. యంగూన్‌లో ఉన్న శ్మశానవాటికలోనే ఆ నలుగురికీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

