Einstein’s theory | న్యూఢిల్లీ: అంతరిక్షంలో ఇప్పటిదాకా అంతు చిక్కని, దాక్కొని ఉన్న డార్క్ మ్యాటర్ (కృష్ణ పదార్థం)కు సంబంధించిన వివరణాత్మక పటాన్ని ఖగోళ పరిశోధకులు తయారు చేశారు. దీంతో 85 శాతం విశ్వం స్వరూపాన్ని అంచనా వేసే అవకాశం కలిగింది. కృష్ణ పదార్థం కాంతి శోషించుకోవడం లేదా వెలువరించడం చేయదు.
అది గురుత్వాకర్షణ శక్తితో పరస్పర ప్రభావం కలిగి ఉంటుంది. కృష్ణ పదార్థంలోని పాల పుంతల వంటి భారీ వస్తువుల వల్ల ఏర్పడిన గురుత్వాకర్షణ కేంద్రం వాటి గుండా ప్రయాణించే కాంతిని వంగేలా చేస్తుంది. కృష్ణ పదార్థం గురించి తెలిసిన కొత్త విషయాలు ఐన్స్టీన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రాతిపదికగా ఉన్న కాస్మోలజీ ప్రమాణాలతో ఏకీభవించాయని పరిశోధకులు తెలిపారు.