బీరుట్, మార్చి 8: సిరియాలో రెండు వర్గాల మధ్య ప్రతీకార దాడుల్లో 600 మందికి పైగా మరణించారు. ప్రభుత్వ భద్రతా దళాలు, పదవీచ్యుతుడైన సిరియన్ మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ విధేయుల మధ్య రెండు రోజులుగా జరిగిన ప్రతీకార దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. 14 ఏండ్ల సిరియా సంక్షోభంలో ఇది భయంకరమైన మారణకాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ ఒకటి శనివారం తెలిపింది. అసద్‌ను పదవి నుంచి దించేసి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు నెలల తర్వాత డమాస్కస్‌లో ఏర్పడిన ఘర్షణలు నూతన ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భద్రతా దళాలపై అసద్ విధేయులు శుక్రవారం నుంచి దాడి చేయడం ప్రారంభించారు. ముష్కరులు అలవైట్లను ఊచకోత కోశారని స్థానికులు తెలిపారు.