Viral Video | సోషల్ మీడియా నిత్యం ఎన్నో వీడియో వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. మరికొన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. తరుచుగా జంతువులకు సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కోతికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఓ వ్యక్తిని కోతి స్నేహితుడిలా భుజంతట్టి ఓదారుస్తున్న తీరు అందరినీ అబ్బురపరుస్తున్నది. మనుషులకే కాదు.. జంతువులకు సైతం మనసుంటుందని రుజువు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది.
452- Ağlayan arkadaşını dizine yatırıp teselli eden maymun pic.twitter.com/gezl0NKX8g
— 59.748 farklı hayvan (@59748hayvan) July 30, 2022
ఈ వీడియో ఓ వ్యక్తి వచ్చి కోతిపక్కనే కూర్చున్నాడు.. అతను ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తుండగా.. దీన్ని గ్రహించిన కోతి అతని భుజంపై తడుతుంది. తర్వాత తన కాళ్లపై పడుకోమంటూ.. సైగలు చేస్తుంది. ఆ వ్యక్తి దాని కాళ్లపై పడకోగా.. భుజంపై తడుతూ ఓదారుస్తూ.. ప్రోత్సహిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్గా మారింది. ఇప్పటి వరకు 3.4 మిలియన్ల మంది దీన్ని వీక్షించగా.. 44వేల మంది లైక్ చేశారు. ‘ప్రస్తుతం నేనున్న మానసిక స్థితిలో.. ఈ తెలివైన కోతి నాకు కావాలి’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘ఆప్త మిత్రుడు’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. పలువురు తెలివైన మంకీ అని మెచ్చుకుంటుండగా.. మరికొందరు కోతులు సైతం స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యాయని మరికొందరు పేర్కొంటున్నారు.