పిల్లలకు క్రూర జంతువుల గురించి తెలియదు. ప్రాణహాని ఉంటుందని తెలియక వాటితో ఆడుకోవాలని చూస్తారు. యూఎస్‌లో ఓ చిన్నారి ఎలుగుబంటి కనిపించగానే దాన్ని వాటేసుకునేందుకు పరుగెత్తింది. ఇది గమనించిన తల్లి పరుగెత్తికెళ్లి ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడింది. హీరో మామ్‌గా ప్రశంసలు అందుకుంటున్నది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయగా, 3.2 మిలియన్ల మంది వీక్షించారు. ఈ దృశ్యం సెక్యురిటీ కెమెరాలో రికార్డయ్యింది. వాషింగ్టన్‌లోని ఓ ఇంటి వెనుక గోడపైనుంచి ఎలుగుబంటి వచ్చింది. డోర్ వద్ద ఉన్న చిన్నారి, ఎలుగుబంటి వద్దకు పరుగెత్తింది. గమనించిన తల్లి సాహసం చేసి, చిన్నారిని రక్షించింది. డోర్లోపలికి వచ్చి, లాక్ చేసేసింది. ఇదిలా ఉండగా, తన కూతురు ఇటీవలే యానిమల్ బుక్ చదివిందని, తన ఫేవరెట్ యానిమల్ ఎలుగుబంటి అని చెప్పిందని ఆ తల్లి పేర్కొంది. క్రూర జంతువుల గురించి తనకూతురికి వివరిస్తానని చెప్పింది.