కీవ్: యుద్ధంలో బుల్లెట్ల వర్షం కామన్. దూసుకువస్తున్న ఆ బుల్లెట్ల నుంచి తప్పించుకోవడం సైనికులకు ఓ పెద్ద టాస్క్. కొన్ని సందర్భాల్లో ఏవేవో ఆ జవాన్ల ప్రాణాలను కాపాడుతుంటాయి. ఇక ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్‌లో ఓ సైనికుడు తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ప్రాణాలు దక్కించుకున్నాడు. దూసుకువస్తున్న బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు నక్కి నక్కి వెళ్తున్న ఓ ఉక్రెయిన్ సైనికుడిపైకి బుల్లెట్ ఫైర్ అయ్యింది. ఆ సమయంలో అతని వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ఆ బుల్లెట్‌ను అడ్డుకున్నది. మరో సైనికుడితో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఫోన్ వెనుక భాగంలో బుల్లెట్ దిగిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. తన పాకెట్ నుంచి ఫోన్ తీయగా.. ఆ ఫోన్ వెనుక భాగంలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. రష్యా సైన్యం వదిలిన 7.62x39mm బుల్లెట్ అని నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ సైనికుడి వద్ద ఉన్న ఫోన్ ఏ కంపెనీదో తెలియదు. బహుశా అది శాంసంగ్ మోడల్ అయి ఉంటుందని నెటిజెన్లు భావిస్తున్నారు.