లండన్ : ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక నగరంగా పేరొందిన లండన్‌లో ఇటీవల రికార్డ్ స్థాయిలో మొబైల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. నగరంలో చాలా మంది ఫోన్ దొంగల బాధితులే. పోలీస్ రికార్డుల ప్రకారం ఈ ఫిబ్రవరిలో 70,095 ఫోన్లు చోరీకి గురయ్యాయి. చైనా విద్యుత్తు బైక్‌లపై ఫోన్ దొంగలు వీధుల్లోకి దూసుకొచ్చి ప్రజల చేతుల్లోని ఫోన్లను లాక్కొని పరారవుతున్నారు. దీంతో చోరీ నిరోధక ఫీచర్లను ఫోన్లలో అమర్చాలని బ్రిటన్ సర్కారు సాంకేతిక కంపెనీలను కోరింది.