వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి మిసిసిప్పీలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. లేలాండ్ అనే చిన్న నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఫుట్బాల్ ఆట ముగిసిన వెంటనే రద్దీగా ఉన్న ఒక వీధిలోని ఓ స్కూల్ ప్రాంగణంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని మేయర్ జాన్ లీ తెలిపారు.
శుక్రవారం రాత్రి లేలాండ్లో అసాధారణ రద్దీ నెలకొంది. అక్కడి పాఠశాలలు పూర్వ విద్యార్థులను పిలిచి స్వాగతించడమే కాక, ఫుట్బాల్ ఆటలు, కమ్యూనిటీ ఈవెంట్లు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో వేడుకలు జరుపుకుంటున్న పాఠశాలలో ఈ కాల్పులు జరిగాయి.