లెవిరా: రెడ్ వైన్(Red Wine) వరదలై పారింది. గంగా ప్రవాహంలో కొట్టుకుపోయింది. పోర్చుగల్లోని సావో లోరెంకో డీ బైరో వీధుల్లో.. రెడ్ వైన్ వరదలా ప్రవహించింది. ఆ చిన్న పట్టణంలో ఉన్న వీధులన్నీ రక్తపుటేరులయ్యాయి. మిలియన్ల లీటర్ల రెడ్ వైన్.. వీధుల వెంటా ఉరుకులు పరుగులు తీసింది. ఎత్తైన ప్రదేశం నుంచి కింద ఉన్న వీధుల దిశగా ఆ వైన్ పారింది. పట్టణంలో ఉన్న ఓ డిస్టిల్లరీ నుంచి ఆ వైన్ వచ్చినట్లు చెబుతున్నారు.
దాదాపు రెండు మిలియన్ల లీటర్ల రెడ్ వైన్.. బ్యారళ్లు పేలడంతో వరదలా ప్రవహించింది. సుమారు ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ అంత వైన్ నేలపాలయ్యింది. అగ్నిమాపక శాఖ రంగంలో దిగి ఆ వైన్ ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేసింది. సమీపంలో ఉన్న సెర్టిమా నదిలోకి ఆ వైన్ వెల్లి కలిసింది. ఈ ఘటన పట్ల లెవిరా డిస్టిల్లరీ క్షమాపణలు చెప్పింది. ఆ ప్రవాహం వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. క్లీనింగ్ ప్రక్రియ కూడా చేపట్టనున్నట్లు తెలిపింది.
Grab your glasses! Wine is flowing in the streets!🍷
On Sunday, September 10, 2023, a rupture in two red wine tanks at Levira Distillery in São Lourenço do Bairro, Portugal, led to a wine-filled spectacle in the town’s streets.
Fortunately, local volunteer firefighters acted… pic.twitter.com/9Lh7cH60g4
— Starcasm (@starcasm) September 11, 2023