వాషింగ్టన్, అక్టోబర్ 2: ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా ఇటీవల ఓ కొత్త సాంకేతికతను ఆవిష్కరించింది. కొన్ని పదాల కూర్పుతో (ఆ పదాలలో ఏదైతే చెప్పామో, దానికి అనుగుణంగా తక్కువ నిడివితో) ఓ వీడియోను క్రియేట్ చేసే కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను తయారు చేసింది. ‘సూపర్ హీరో దుస్తులు, ఎరుపు టోపీ ధరించిన ఓ కుక్క ఆకాశంలో విహరిస్తున్నది’ అని పదాలను టైప్ చేయగానే.. కొత్త టెక్నాలజీ ఆ పదాల్లోని సారాంశాన్ని చూపేలా 5 సెకన్ల వీడియో క్లిప్‌ను తయారు చేసింది. కృత్రిమ మేధస్సు పరంగా తదుపరి తరంలో టెక్నాలజీ వ్యవస్థలో రాబోయే మార్పులను ఇది సూచిస్తుంది.