లాస్ఏంజెల్స్, మార్చి 11: ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్‌ను తీసుకువచ్చేందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా కసరత్తు చేస్తున్నది. టెక్ట్స్ ఆప్డేట్లు షేర్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్నట్టు మెటా అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
క్రియేటర్లు, ప్రముఖులు దీని ద్వారా తమ ఆప్డేట్లను, ఆసక్తులను వెల్లడించే వీలుంటుందని తెలిపారు. కాగా, ‘పీ92’ అనే కోడ్ పేరుతో ఈ యాప్‌ను రూపొందించే పనిలో మెటా నిమగ్నమైందని తెలుస్తున్నది. మరోవైపు ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే కూడా ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ‘బ్లూస్కై’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇది పరీక్షల దశలో ఉంది.