వాషింగ్టన్, ఆగస్టు 03: అమెరికాలోని ఒహియో రాష్ట్ర సొలిసిటర్ జనరల్‌గా భారత సంతతి న్యాయవాది మధురా శ్రీధరన్ నియమితులయ్యారు. అమెరికాలో 2003లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఒహియో వర్సెస్ ఈపీఏ కేసు విషయంలో సుప్రీంకోర్టులో శ్రీధరన్ వాదనలు వినిపించారు. వృత్తిపరంగా గొప్ప గుర్తింపును అందుకుంటున్న ఆమెపై అమెరికాలోని కొంతమంది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.
తన పేరు, సాంప్రదాయ పద్ధతుల్లో నుదుటిన బొట్టును ధరించటం, ఆమె వారసత్వాన్ని ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ట్రోలింగ్‌కు పాల్పడటం చర్చనీయాంశమైంది. కాగా, దీనిపై ఒహియో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ స్పందిస్తూ, సొలిసిటర్ జనరల్‌గా శ్రీధరన్ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదిగా ఆమె అర్హతలను ప్రశంసించారు.