లండన్ : యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ నేతృత్వంలో సెంట్రల్ లండన్లో శనివారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇంగ్లండ్, బ్రిటన్ జెండాలతో వేలాది మంది దీనిలో పాల్గొన్నారు.
థేమ్స్ నది దక్షిణ ప్రాంతంలోని వీధుల గుండా వెస్ట్ మినిస్టర్లోని పార్లమెంటు వైపు ప్రదర్శనగా వెళ్లారు. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వలసదారులను బ్రిటన్ నుంచి పంపించేయాలనే నినాదాలతో ప్లకార్డులు ధరించారు.