ఇస్లామాబాద్: పాకిస్థాన్లో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను ప్రకటించింది. రాత్రి 8.30 గంటలలోపు మార్కెట్లు మూసివేయాలని, 10 గంటలోపు పెండ్లి మండపాలు బంద్ చేయాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా విద్యుత్తు రంగంలో భారీగా పెరుకుపోతున్న రుణాలను తగ్గించుకోవాలంటే తొలుత విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విద్యుత్తు వినియోగాన్ని భారీగా తగ్గించాలని సూచించింది.