వాషింగ్టన్: అమెరికా (America) వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. లాస్ ఏంజెలెస్తోపాటు నార్త్ కరోలినాలో దుండగులు కాల్పులకు పాల్పడగా, కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనల్లో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
నార్త్ కరోలినాలోని హికోరిలో ఓ ప్రైవేట్ ప్రాపర్టీలో జరిగిన కాల్పల్లో ఒకరు మృతిచెందగా, 11 మంది గాయపడ్డారు. అదేవిధంగా లాస్ ఏంజెలెస్ నగరంలోని బాల్డివన్ పార్క్లో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి మరణించాడు. మరొకరు గాయపడ్డారు. అనంతరం అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు.
కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడికి పాల్పడ్డాడు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ మండే స్వభావం కలిగిన ద్రావణ సీసాలను విసిరాడు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ నినాదాలు చేశారు. అనుమానితుడు మహమ్మద్ సబ్రీ సోలిమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ ఘటనను ఉగ్రదాడిగా అభివర్ణించారు.