ఇంటర్నెట్ డౌన్.. బ్యాంకులు, ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లు క్రాష్

మెల్బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన సెంట్రల్ బ్యాంక్‌తో పాటు ఆ దేశ పోస్టల్ సర్వీసు, ఇతర బ్యాంకుల వెబ్సైట్లు క్రాష్ అయ్యాయి. అమెరికాకు చెందిన కొన్ని ఎయిర్‌లైన్స్‌కు కూడా ఇంటర్నెట్ సరఫరా నిలిచిపోవడంతో వాటి సైట్లు డౌన్ అయినట్లు తెలుస్తోంది. వెబ్ సర్వీస్ కంపెనీ అకామాయిలో సమస్యలు తలెత్తడంతో.. అనేక సంస్థల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఏఎన్జెడ్, వెస్ట్‌ప్యాక్, సెయింట్ జార్జ్, ఎంఈ బ్యాంక్, మాక్వయిరీ బ్యాంక్, అలియాంజ్, కామన్వెల్త్ బ్యాంక్‌లకు సేవలు తాత్కాలికంగా స్తంభించిపోయాయి. బ్యాంకింగ్ యాప్‌లు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా ఇంటర్నెట్ లేకపోవడంతో వాటి వెబ్సైట్లు క్రాష్ అయ్యాయి. ఇంటర్నెట్ లేకపోవడానికి తామే కారణమని అకామాయి అంగీకరించింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

