Google Maps | కొందరు స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసుకుంటారు. గుడ్డిగా అది ఏ రూట్ చెబితే ఆ రూట్లో వెళ్తుంటారు. కానీ.. ఒక్కోసారి గూగుల్ కూడా పొరపాటు చేయొచ్చు. అలా చాలా సార్లు గూగుల్‌ను నమ్మి మోసపోయిన వాళ్లు ఉన్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా ఎక్కడికో వెళ్లిపోయామని.. దారి తప్పామని.. ఇంకా కొందరైతే డెడ్ ఎండ్‌కు చేరుకున్నాక కూడా గూగుల్ మ్యాప్స్‌లో రూట్ చూపిస్తోందని.. ఇలా పలు రకాలుగా బుక్ అయిన వాళ్లు ఉన్నారు.
తాజాగా ఓ వ్యక్తిని ఏకంగా మామిడి చెట్టు మధ్యలో నుంచి వెళ్లాలంటూ రూట్ చూపించిందట మ్యాప్స్‌లో. దీంతో ఆ వ్యక్తి షాక్ అవడమే కాదు.. అనవసరంగా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో తిట్లు కూడా తినాల్సి వచ్చిందట. ఈ ఘటన వెస్ట్ ఆఫ్రికాలోని ఘనా దేశంలో చోటు చేసుకుంది.
తన ఫ్యామిలీతో ఆల్ఫ్రెడ్ అనే ఓ వ్యక్తి కారులో వేరే చోటుకు వెళ్తున్నాడు. తనకు రూట్ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాడు. గూగుల్ మ్యాప్స్ సాయంతో కారును తీసుకెళ్తున్నాడు. ఇంతలో మెయిన్ రోడ్డు నుంచి రూట్ మారింది. వేరే రూట్ చూపించింది మ్యాప్స్.
సరే అని కారును మ్యాప్స్ చూపించిన రూట్‌కు తిప్పాడు. చివరకు అది ఏకంగా ఓ మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్లింది. మ్యాప్స్‌ను రూట్ అడిగితే.. మామిడి చెట్టు మధ్యలో నుంచి వెళ్లి టర్న్ లెఫ్ట్ అంటూ చూపించింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆల్ఫ్రెడ్‌కు. ఆ మామిడి చెట్టు తర్వాత అక్కడ రూటే లేదట. దీంతో తన కుటుంబ సభ్యులతోనూ తిట్లు తినాల్సి వచ్చిందని.. గూగుల్ మ్యాప్స్‌ను నమ్మకున్నందుకు తనకు బాగానే శాస్తి జరిగిందని ట్విట్లు చేశాడు. ఆ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబు.. నీకే కాదు.. మాకూ చాలాసార్లు ఇటువంటి అనుభవం ఎదురైంది.. అంటూ నెటిజన్లు తమ అనుభవాలను కూడా ట్వీట్ చేశారు.
Story of my life today. My family have been hissing and puffing at me all day for taking them to dead ends!
— Naa Oyoe Ofei (@NaOyoe) December 27, 2021
I'll never forget the day we used Google maps to travel to Calabar by road. Before we knew it, we were in one village with a dead end. Google maps said we should continue going 😭😭
— M. (@mxndxyluv) December 27, 2021
That's how my mum and I were going to Dodowa with Google maps and we end up using some unrelated roads to go😂😂😂. Since then I've never trusted google https://t.co/LLqaeqgMVQ
— Daikie A👑 (@daaaaiikkiee) December 28, 2021
Will never forget accepting a shorter route to Kpetoe via Sogakope. Beginning of road was tarred and all seemed well until the tarred portion ended and portions of road seemed like bush path/ tracks. Gone too far and it was getting late. Had to complete journey through the bush https://t.co/KP5lvbpKYl
— Local Pig Farmer 🇬🇭 (@pkamoh) December 27, 2021
Lmao, this thing take my friend and I to some bridge top and talk we "your destination is on the right" kwasia make we jump into the water or what? 😂😂 https://t.co/G9Zz7jSDrr
— Akuffo Addo adi yɛn awu (@sirmike_io) December 28, 2021