ఒక గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా మూడు గంటలు ఓ వ్యక్తి ఐస్ బాక్స్‌లో కూర్చున్నాడు. ఐస్‌ను కొంత సేపు చేయి మీద వేసుకుంటేనే చేయి మొత్తం ఎలాగో అవుతుంది. రక్తం గడ్డ కట్టినట్టుగా అవుతుంది. కానీ.. ఈ వ్యక్తి మాత్రం ఏకంగా ఐస్ బాక్స్‌లో మూడు గంటలు కూర్చొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఘటన పొలాండ్‌లో చోటు చేసుకుంది.
రొమనోవ్స్కీ అనే వ్యక్తి ఈ ఫీట్‌ను సాధించాడు. బయట వాతావరణం కూడా చల్లగా ఉన్నా.. 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా.. ఐస్‌తో నిండి ఉన్న గ్లాస్ బాక్స్‌లో కదలకుండా మూడు గంటల 28 సెకండ్స్ కూర్చొని సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
ఇదివరకు ఫ్రాన్స్‌కు చెందిన రోమేన్ వాండెన్డోర్పె అనే వ్యక్తి 2020లో 2 గంటల 35 నిమిషాల 33 సెకండ్ల పాటు ఐస్‌లో కూర్చొని గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును రొమనోవ్స్కీ బద్దలు కొట్టాడు. అంతకుముందు 2014లో చైనాకు చెందిన జిన్ సాంగ్హావ్ అనే వ్యక్తి గంటా 53 నిమిషాల 10 సెకన్లు పాటు ఐస్ బాక్స్‌లో ఉండి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. 2013లో నెదర్లాండ్స్‌కు చెందిన విమ్ హాఫ్ అనే వ్యక్తి ఒక గంటా 53 నిమిషాల 2 సెకండ్ల పాటు ఐస్ బాక్స్‌లో ఉండి రికార్డు క్రియేట్ చేశాడు.
ఈ ఫీట్ సాధించడం కోసం రొమనోవ్స్కీ దాదాపు ఆరు నెలల పాటు ట్రెయినింగ్ తీసుకున్నాడు. ఐస్‌లో ట్రెయినింగ్ పొందాడు. ఐస్ వాటర్‌లో ఉండటం.. ఫ్రీజింగ్ ఎయిర్‌లో గడపడం.. చల్లటి నీళ్లతో స్నానం చేయడం ఇలా.. ఐస్‌కు సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయించుకొని.. తన బాడీని ఐస్‌కు అలవాటు అయ్యేలా చేసిన తర్వాతనే ఈ ఫీట్ చేయడానికి రొమనోవ్స్కీ రంగంలోకి దిగి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.