న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో ఓ కారు అతడిని వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడు ఎగిరి అంత దూరంలో పడ్డాడు. కొద్దిగా ముందుకు వెళ్లిన ఆ కారు ఆగింది. అందులో నుంచి దిగిన ఇద్దరు యువకులు.. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి వద్దకు వెళ్లారు. క్షతగాత్రుడి జేబులు వెతికి.. దొరికినవి ఎత్తుకెళ్లారు. ఇదంతా సమీపంలో ఉన్న ఓ కెమెరాలో రికార్డయింది. వీడియోను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ (NYPD)సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
🚨WANTED for ROBBERY: Do you know these guys? On 7/23/22 at approx. 6:40 AM, opposite 898 E 169 St in the Bronx, the suspects struck a 39-year-old male with a car, then proceeded to forcibly take his property. Any info? DM @NYPDTips, or anonymously call 800-577-TIPS. pic.twitter.com/RngQ1JUA4C
— NYPD NEWS (@NYPDnews) July 24, 2022
ఈ ఘటన శనివారం చోటు చేసుకున్నదని పేర్కొన్నారు. రోడ్డు దాటుతున్న 35 ఏండ్ల వ్యక్తిని ఓ కారు కావాలనే ఢీకొట్టిందని, తీవ్ర గాయాలతో అల్లాడుతున్న అతడిని పట్టించుకోకుండా.. కారులో నుంచి దిగిన ఇద్దరు యువకులు, ఆ వ్యక్తి జేబుల్లో ఉన్నవి దోచుకెళ్లారని చెప్పారు. అనంతరం తాము అతడిని దవాఖానకు తరలించామని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.