ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఒక వ్యక్తి చెవిలో బొద్దింక ఏకంగా మూడు రోజుల పాటు తిష్ట వేసింది. చెవిలో అది దూరడం వల్ల ఆ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. చివరకు 3 రోజుల తర్వాత దాని పీడను వదిలించుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో చోటు చేసుకుంది.
జేన్ వెడ్డింగ్ అనే వ్యక్తి చెవిలో దురదగా అనిపించడంతో నీళ్లు పోయాయేమో అనుకున్నాడట. కానీ.. కొంత సేపటి తర్వాత చెవిలో ఏదో కదులుతున్నట్టు అతడికి అనిపించిందట. దీంతో ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ దగ్గరికి వెళ్లాడు.
దీంతో ఆ డాక్టర్.. కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చి చెవిని హెయిర్డ్రైయర్తో శుభ్రం చేసుకోవాలని సూచించాడు. అయినప్పటికీ అతడి సమస్య తీరలేదు. చెవిలో బొద్దింక చేష్టలు మామూలుగా లేవు. దీంతో తప్పని పరిస్థితుల్లో చెవి స్పెషలిస్టు దగ్గరికి వెళ్లడంతో ఏదైనా పురుగు కానీ లేదంటే చెవిలో గడ్డ కానీ అయి ఉంటుందని చెప్పడంతో షాక్ తిన్నాడు. చివరకు తన చెవిలో నుంచి బొద్దింకను బయటికి తీశాక కానీ… వెడ్డింగ్ నమ్మలేదు. మూడు రోజుల పాటు అది తన చెవిలో బతికే ఉండటంతో వెడ్డింగ్ కంగు తిన్నాడు.
దాన్ని బయటికి తీశాక కానీ.. అతడు ప్రశాంతంగా ఉండలేకపోయాడు. ఈ ఘటనను జేన్ వెడ్డింగ్ తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. తన చెవిలో నుంచి బయటికి తీసిన బొద్దింక ఫోటోను కూడా షేర్ చేశాడు. దీంతో తన స్టోరీ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.