సాధారణంగా వర్కవుట్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దాని కోసం ఎంతో కష్టపడాలి. వర్కవుట్స్లోనూ చాలా ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే అది సాధ్యం అవుతుంది. చాలామంది బాడీ ఫిట్నెస్ కోసం భారీగా వర్కవుట్స్ చేస్తుంటారు. జిమ్‌కు వెళ్తుంటారు. లేదంటే ఇంట్లోనే వ్యాయామం చేస్తుంటారు. కానీ.. ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఏకంగా హెలికాప్టరుకు వేలాడి.. అది గాల్లో ఉండగా దాన్ని పట్టుకొని పుల్అప్స్ చేశాడు. అలా.. అర్మేనియాకు చెందిన రోమన్ సహ్రద్యాన్ అనే వ్యక్తి 23 పుల్అప్స్ చేసి రికార్డు సృష్టించాడు. అది కూడా ఒక్క నిమిషంలోనే.
కింద పడుకొని పుషప్స్ అందరూ చేస్తారు. పుల్అప్స్ కూడా అందరూ చేస్తారు. కానీ.. ఇలా.. గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్‌ను పట్టుకొని పుల్అప్స్ చేయడం అనేది దాదాపు అసాధ్యమైన పని. దాన్ని సుసాధ్యం చేశాడు కాబట్టే.. రోమన్ అనే వ్యక్తి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.