కువైట్, మే 8: కువైట్‌కి చెందిన అల్ రెఫై అనే 24 ఏండ్ల యువకుడు అరుదైన ఫీట్ సాధించాడు. ఏకంగా 7 అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించా డు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే పిన్న వయస్కుడిగా గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.
అల్రెఫై అధిరోహించిన అగ్నిపర్వతాల జాబితాలో కిలిమంజారో(టాంజానియా), మౌంట్ ఎల్బ్రస్(రష్యా), మౌంట్ గిలువే(పపువా న్యూగినియా), పికొడీ ఒరిజాబా(మెక్సికో), మౌంట్ దమవండ్(ఇరాన్), ఒజోస్ దెల్ సలాదో(అర్జెంటీనా-చిలీ), మౌంట్ సిడ్లే(అంటార్కిటికా) ఉన్నాయి.