లండన్, డిసెంబర్ 27: జలియన్‌వాలా బాగ్ మారణహోమానికి ప్రతీకారంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2ను చంపేస్తానన్న వ్యక్తి(19)ని స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం మాస్కు ధరించిన ఓ వ్యక్తి.. తాను ఇండియన్ సిక్కునని, తన పేరు జశ్వంత్ సింగ్ చైల్ అని చెప్తూ జలియన్ వాలా బాగ్ ఉదంతానికి ప్రతీకారంగా రాణి ఎలిజబెత్‌ను హత్య చేస్తానని వీడియో రిలీజ్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నదని, అతడి వివరాలను నిర్ధారించాల్సి ఉన్నదని తెలిపారు.