కాబూల్: ధనవంతుల కుటుంబానికి ఇచ్చి పెండ్లి చేస్తానని మాయమాటలు చెప్పి అమాయకులైన 130 మంది పేద మహిళలను విక్రయించిన ఓ దుండగుడిని అరెస్టు చేసినట్టు తాలిబన్ నేతలు వెల్లడించారు. నిందితుడు మనుషుల అక్రమ రవాణా ముఠాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.