Mamata Banerjee | దుబాయ్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీకి దుబాయ్ విమానాశ్రయంలో అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్, స్పెయిన్ దేశాల పర్యటనకు ఆమె వెళ్లారు. బుధవారం ఆమె దుబాయ్ విమానాశ్రయంలో ఉన్న సమయంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆమెతో మాట్లాడారు.
‘ప్రతిపక్ష ఇండియా కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా?’ అని నవ్వుతూ అడిగినపుడు మమత మొదట ఆశ్చర్యపోయారు. ‘ప్రజలు మద్దతిస్తే, భవిష్యత్తులో అధికారం చేపడతాం’ అని బదులిచ్చారు. ఆమె పన్నెండు రోజులపాటు దుబాయ్, స్పెయిన్లలో పర్యటిస్తారు.